ప్రియుడి విష‌యంలో కోర్టుకెక్కిన అమ‌లాపాల్‌.. అంత ర‌చ్చ ఏం చేశాడు!

ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలో త‌ళుక్కున మెరిసిన అమ‌లాపాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా త‌మిళ సినిమాలే చేస్తున్న ఈ అమ్మ‌డు కొద్ది రోజుల క్రితం ఆడై అనే సినిమాతో వార్త‌ల‌లోకి ఎక్కింది. ఈ సినిమాలో అమ‌లాపాల్ న‌గ్నంగా న‌టించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మయంలో త‌మిళ‌ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ని వివాహం చేసుకున్న‌ అమ‌లాపాల్ కొన్నాళ్ళ‌కు అత‌నికి విడాకులు ఇచ్చింది. విజ‌య్ వేరే పెళ్లి చేసుకున్నా కూడా అమ‌లాపాల్ మాత్రం పెళ్లి జోలికి వెళ్ళ‌కుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

ఆ మ‌ధ్య బాలీవుడ్‌ సింగర్‌ భువ్‌నిందర్‌ సింగ్‌తో ప్రేమాయ‌ణం కొనసాగిస్తున్న‌ట్టు పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు ఈ ఏడాది మార్చి నెలలో బాలీవుడ్ సింగర్ భువ్‌నిందర్ సింగ్‌తో పెళ్లి దుస్తుల్లో ఉన్న అమలా పాల్ ఫోటోలు వైరల్‌‌గా మారడంతో అభిమానుల‌లో ఎన్నో అనుమానాలు మొద‌ల‌య్యాయి . వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్నార‌ని అంతా శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే ప్రొఫెషనల్ షూట్‌ కోసం తీసిన ఫోటోలను భువ్‌నిందర్ తన సోష‌ల్ మీడియాలో షేర్ చేసి‌ తప్పు అర్థం వచ్చేలా పోస్టు చేసాడ‌ని, దీని వ‌ల‌న పరువుకు న‌ష్టం చేకూరింద‌ని అమలా పాల్ చెన్నై హైకోర్టుని ఆశ్ర‌యించింది.

అమలాపాల్‌ ఆరోపణలు విన్న న్యాయమూర్తి.. భువ్‌నిందర్‌పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆమె భువ్‌నిందర్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల‌కు‌ ఫిర్యాదు చేసింది. దీంతోపై పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే భువ్‌నిందర్ సింగ్, అమలాపాల్ రహస్యంగా పెళ్లి చేసుకుని విడిపోయారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై ఎవ‌రు స్పందించ‌లేదు. అయితే ఎప్పుడు వివాద‌ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించే అమ‌లాపాల్ ఈ సారి త‌న బాయ్ ఫ్రెండ్ విష‌యంలో కోర్టుకెక్క‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది