Chiranjeevi: సంధ్య థియేటర్ వద్ద రేవతి అనే అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసినదే .ప్రస్తుతం ఈయన అరెస్టు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. ఏ సినిమా విడుదలైన సెలబ్రిటీలు థియేటర్లకు కుటుంబంతో సహా పెళ్లి సినిమాలను చూస్తూ ఉంటారు అయితే భద్రతా లోపం కారణంగానే పుష్ప 2 ప్రీమియర్ షో వేల రేవతి అనే మహిళా అభిమాని మరణించింది అయితే ఈ విషయంపై తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు తనని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సలు పూర్తి చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఇటు ఇండస్ట్రీ పరంగా అటు రాజకీయాల పరంగా తీవ్ర చర్చలకు కారణం అవుతుంది ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తయారైన విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి దంపతులు హుటాహుటిన బన్నీ ఇంటికి వెళ్లారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి చిరంజీవికి ఈ విషయం తెలిసిన వెంటనే సినిమా షూటింగులకు ప్యాకప్ చెప్పేసి మరి ఈయన తన భార్య సురేఖతో కలిసి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు.
అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళిన చిరంజీవి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాల గురించి ఆరా తీశారు అలాగే తనకు ఏం కాదని బన్నీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు..మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఆయన తండ్రి అల్లు అరవింద్ అలాగే తమ్ముడు అల్లు శిరీష్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ లాయర్లు కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి కూడా తెలిసిందే. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టు విషయంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది.