ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు!

సంధ్యా థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాత్రంతా జైలులోనే ఉన్న వాళ్ళు అర్జున్ శనివారం పొద్దున్న మద్యంతర బెయిల్ పై బయటికి వచ్చి నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ తన న్యాయవాదుల బృందంతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంటికి చేరుకున్నాడు.

అప్పటికే అతని కోసం రాత్రంతా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అర్జున్ ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. స్నేహ రెడ్డి అయితే భర్తని ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత పిల్లల్ని పట్టుకొని ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్. తర్వాత శిరీష్,అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా అల్లు అర్జున్ ని ఆలింగనం చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. తర్వాత గుమ్మడికాయతో దిష్టి తీసి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ని ఇంట్లోకి తీసుకువెళ్లారు.

భర్తని ఆలింగనం చేసుకొని స్నేహారెడ్డి కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలచి వేసింది. కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు, నేను చట్టాన్ని గౌరవిస్తాను నేను బాగానే ఉన్నాను నాకోసం ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు, కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏమి మాట్లాడలేదు. జరిగిన సంఘటన అనుకోకుండా జరిగింది రేవతి గారి కుటుంబానికి జరిగిన అన్యాయం పూడ్చలేనిది.

వారికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది, నేను 20 సంవత్సరాలుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నాను, నాది మాత్రమే కాదు మావయ్య సినిమాలు కూడా చూస్తాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు అని చెప్పిన అల్లు అర్జున్ తనకి మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. నిజానికి మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ రాత్రే విడుదల అవుతాడు అని అందరూ అనుకున్నారు కానీ శనివారం ఉదయం విడుదల అయ్యాడు.