ఇన్సైడ్ టాక్ : మధ్యలో బన్నీ ఇంకో సినిమా చేయనున్నాడా?

Allu-Arjun

లేటెస్ట్ గా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో భారీ మొత్తంలో అనౌన్స్ అయ్యిన సినిమా అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ఐతే అనౌన్స్ చేశారు. కాగా ఈ కాంబినేషన్ లో భారీ సినిమాగా ఇది రానుండగా ఈ సినిమా అయితే అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 తర్వాత ఇమిడియెట్ ప్రాజెక్ట్ గా ఉండదట.

అల్లు అర్జున్ కెరీర్ లో 23వ సినిమాగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే ఈ మాసివ్ ప్రాజెక్ట్ కన్నా ముందు అంటే 22వ సినిమాగా బన్నీ ఇంకో సినిమా చేస్తాడని ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ సినిమా అయితే ఎవరితో చేస్తాడు అనేది ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి బన్నీ 22వ సినిమా అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి లేకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మళ్ళీ అల్లు అర్జున్ వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో ఎవరొకరు అల్లు అర్జున్ 22వ సినిమాని చేసే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా దాదాపు అయితే త్రివిక్రమ్ తోనే అల్లు అర్జున్ వర్క్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. కాగా ఇది అయితే పుష్ప 2 అయ్యాక ఉంటుంది. ఆ తర్వాత సందీప్ సినిమా ఆ తర్వాత మళ్ళీ పుష్ప 3 ఉండే అవకాశం ఉంది. ఇలా అయితే బన్నీ భారీ లైనప్ తో రెడీగా ఉన్నాడు.