“సామజవరగమన” పై అల్లు అర్జున్ రివ్యూ.!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి మంచి సక్సెస్ ని చూస్తున్న చిత్రం “సామజవరగమన”. యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అయితే నిఖిల్ భారీ చిత్రం “స్పై” పోటీ ఉన్నప్పటికీ కూడా భారీ వసూళ్లతో వీక్ డేస్ లో దూసుకెళ్తుంది. దీంతో శ్రీవిష్ణు మరో హిట్ ని అయితే మళ్ళీ రాజ రాజ చోర తర్వాత అందుకున్నాడని చెప్పాలి.

అయితే ఈ చిత్రం కి ఇమెన్స్ పాజిటివ్ టాక్ రాగా ఈ టాక్ తో అయితే ఈ చిత్రం పై లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రివ్యూ ఇవ్వడం వైరల్ గా మారింది. మరి ఈ చిత్రం చూసిన అల్లు అర్జున్ అయితే తన ఎగ్జైట్మెంట్ ని షేర్ చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఒక ప్రాపర్ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అయితే నేను చూసాను అని..

చూసి బాగా ఎంజాయ్ చేసానని ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు సినిమాని నీట్ గా డిజైన్ చేసి రాసాడు ఇక శ్రీవిష్ణు అయితే షో ని రాక్ చేసాడు. నిజంగా తన విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఇక మొగత నటులు నరేష్ గారు వెన్నెల కిషోర్ నా మలయాళీ రెబా మోనికా అందరికి కంగ్రాట్స్ చెప్తూ..

ఓ 100 పర్సెంట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ని అందించిన టెక్నీషియన్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని బన్నీ పోస్ట్ చేసి చిత్ర యూనిట్ కి మరింత బూస్టప్ ఇచ్చాడు. దీనితో ఈ రివ్యూ వైరల్ గా మారింది. మరి ఈ యంగ్ హీరో అయితే అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో బన్నీ ఫ్రెండ్ గా నటించిన సంగతి తెలిసిందే.