Home Entertainment రేంజోవ‌ర్ కార్ లో రోడ్డు పై దూసుకుపోతున్న అల్లు అర్జున్!

రేంజోవ‌ర్ కార్ లో రోడ్డు పై దూసుకుపోతున్న అల్లు అర్జున్!

స్టైలిష్ అల్లు అర్జున్ గత ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల.. వైకుంఠపురములో 200కోట్ల మార్కెట్ ను అందించడంతో బన్నీ ఇప్పుడు అంతకు మించి అనేలా అడుగులు వేస్తున్నాడు. ఇక పుష్పతో పాటు మరో రెండు నిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయితే పూర్తిగా తన దృష్టిని పుష్ప సినిమాపైనే పెట్టనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం అభిమానుకు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు

Allu Arjun | Telugu Rajyam

ఇదిలా ఉంటే .. అర్జున్ ఇటీవ‌ల త‌న ఫ్యామిలీతో దుబాయ్ టూర్ వేసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ త‌న భార్య స్నేహా రెడ్డి, పిల్ల‌లు అయాన్, అర్హ‌ల‌తో క‌లిసి దిగిన పిక్స్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్ క‌లిగించారు. దుబాయ్ టూర్ పూర్తి కావ‌డంతో బ‌న్నీ బుధ‌వారం రోజు హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి త‌న రేంజోవ‌ర్ కారుని స్వ‌యంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళారు బ‌న్నీ.

దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉండ‌గా ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ కోసం కేర‌ళ వెళ్ల‌నున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం సెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 13న విడుద‌ల కానుంది. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

బిగ్ బాస్ లవ్ స్టోరీలు.. భలేగా రాశారే.!

రియాల్టీ షో అనే పేరు పెట్టారుగానీ, అందులో రియాల్టీ కనిపించడంలేదు మొర్రో.. అంటూ పాపం బిగ్ బాస్ అభిమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. దానికన్నా యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా సాగుతోన్న 'మీలో...

Related Posts

Latest News