ఈ తలనోప్పంతా ఆదిపురుష్ వల్లే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అతని రాబోయే చిత్రం “ఆదిపురుష్” జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ “సలార్”, మారుతి దర్శకత్వంలో “రాజా డీలక్స్”, నాగ్ అశ్విన్ “ప్రాజెక్ట్ కె” లైన్ లో ఉన్నాయి.

అయితే, గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఈ సినిమాలకు సంబంధించిన అసలైన అప్‌డేట్‌లను అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. టీజర్లు పోస్టర్లు లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు చిత్రనిర్మాతలను ట్రోల్ చేస్తున్నారు. ఇక “ఆదిపురుష్” విడుదలయ్యే వరకు మిగతా సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌లు విడుదల చేయవద్దని ప్రభాస్ దర్శకులకు సూచించినట్లు తెలుస్తోంది.

అందరి దృష్టి “ఆదిపురుష్” పైనే ఉండేలా ప్రభాస్ చూడాలనుకుంటున్నాడు. అందుకే ఇతర సినిమాలకు సంబంధించిన టీజర్‌లు అప్‌డేట్‌లు అంతగా రావడం లేదట. “ఆదిపురుష్” విడుదల తర్వాత “సలార్” టీజర్ విడుదల కావచ్చని, అదే సమయంలో “ప్రాజెక్ట్ కె” ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక జూన్ 16 తరువాత గాని “రాజా డీలక్స్”కి సంబంధించిన అప్‌డేట్‌లు వచ్చే అవకాశం లేదు. “ఆదిపురుష్” విడుదలలో జాప్యం జరిగినప్పటికీ ఇది ఇప్పటికీ నెగెటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక భారీ అంచనాలున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.