లేటెస్ట్ : మామ అల్లుళ్ళ ట్రీట్ కి ఆల్ సెట్ “బ్రో”..!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర తెరకెక్కుతున్న లేటెస్ట్ సూపర్ మల్టీ స్టారర్ చిత్రాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ హీరో సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న “బ్రో ది అవతార్” కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ ఇప్పుడు వరుస అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తున్నారు.

కాగా ఈరోజు అయితే మరో ఫ్రెష్ అప్డేట్ ని చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కి అందించారు. ఇప్పుడు వరకు బ్రో గా పవన్కళ్యాణ్ మార్క్ అలియాస్ మార్కండేయునిగా సాయి ధరమ్ తేజ్ లు వేరు వేరు పోస్టర్ లు అందించగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇద్దరి కలయికలో మామ అల్లుళ్ళ డ్యూయో పోస్టర్ ని అయితే రేపు విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

మరి ఈ క్రేజీ పోస్టర్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అయితే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తుండగా కేతిక శర్మ లేదా శ్రీ లీలా ఒక స్పెషల్ సాంగ్ ని అయితే చేస్తుంది. అలాగే వెర్సటైల్ నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. అలాగే జీ స్టూడియోస్ సహా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జూలై 28న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.