ఘనంగా అలీ కుమార్తె హల్దీ వేడుక… వైరల్ అవుతున్న వీడియో!

కమెడియన్ ఆలీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా పెళ్లి పనులలో అలీ కుటుంబ సభ్యులు ఎంతో బిజీగా ఉన్నారు. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా డాక్టర్ చదువును పూర్తి చేసుకున్నారు. ఇక ఈమెకు గత రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇలా హైదరాబాదులో ఘనంగా నిశ్చితార్థం చేయగా ఈ నిశ్చితార్థానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.ఇకపోతే ఈమె పెళ్లి తేదీ దగ్గర పడటంతో ఆలీ కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే అలీ దంపతులు పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను కలిసి స్వయంగా తమ కూతురు పెళ్లికి రావాలని ఆహ్వానించారు.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఇక అలీ భార్య జుబేదా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా ఈమె షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఆలీ కుటుంబ సభ్యులతో పాటు తన బంధుమిత్రులు కూడా ఈ హల్దీ వేడుకలలో భాగంగా ఒకరికొకరు పసుపు పూసుకుంటూ ఎంతో సరదాగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక అలీ కుమార్తె వివాహానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.