వామ్మో అలీ అల్లుడి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలీ తాజాగా తన కుమార్తె ఫాతిమా వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.ఫాతిమా వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే అలీ అల్లుడు ఏం చేస్తారు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే అలీ అల్లుడు షహయాజ్ కూడా డాక్టరే అయితే వీరు లండన్ లో నివసిస్తున్నారని తెలుస్తోంది.

అలీ అల్లుడు ఫ్యామిలీ కూడా భారీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని వీరి ఇంట్లో అందరూ ఉన్నతమైన చదువులు చదవడమే కాకుండా తన అన్నయ్య వదిన కూడా డాక్టర్లు కావడం విశేషం. ఇక వీరందరూ కూడా లండన్ లోనే వైద్యులుగా పనిచేస్తున్నారు. ఇలా తన కుటుంబం మొత్తం డాక్టర్లు కావడంతో అలీ కుమార్తె కూడా డాక్టర్ చదువు చదవడంతో తన అల్లుడు కూడా డాక్టర్ కావాలని ఏరికోరి షహాయాజ్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇక వీరి స్వస్థలం గుంటూరు అయినప్పటికీ ఫ్యామిలీ మొత్తం లండన్ లోని స్థిరపడ్డారని తెలుస్తోంది ఇక అల్లుడు సంపాదన కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన కూడా ఏ మాత్రం తీసిపోకుండా భారీగానే సంపాదిస్తున్నట్టు సమాచారం. అలీ అల్లుడు ఏడాదికి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు డబ్బును సంపాదిస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా అలీ తన కుమార్తెకు తన పరపతికి తగ్గట్టు అల్లుడిని తీసుకువచ్చారని సన్నిహితులు సమాచారం.