టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో అలీ కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇప్పటికీ అలీ సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారి చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల అలీ నిర్మాతగా వ్యవహరించిన “అందరూ బాగుండాలి అందులో మేముండాలి ” అనే సినిమా మంచి హిట్ అయింది. ఇలా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే షోలో కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల అలీ తన పెద్ద కుమార్తె ఫాతిమాకి వివాహం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అలీ ఇంట్లో జరిగే మొదటి వివాహ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాడు. ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీల అందరిని ఆహ్వానించాడు. అలీ కూతురి ఎంగేజ్మెంట్ దగ్గర నుండి వివాహ వేడుక పూర్తయ్యే వరకు ఆ వేడుకలకు సంబంధించిన అన్ని విషయాలను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసింది. ఇలా అలీ కూతురు పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆలీ కూతురు ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తి చేయటంతో ఆమెకు కాబోయే బట్ట కూడా డాక్టర్ అయ్యుండాలని అలీ తన కూతురికి ఒక డాక్టర్ని ఇచ్చి వివాహం చేశాడు.
ఆలీ అల్లుడు షేక్ షహయాజ్ మంచి ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి కావటం వల్ల అలీ తనకి కాబోయే అల్లుడికి కోట్ల రూపాయల ఆస్తులు లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ని తన కూతురికి భర్తగా తీసుకొని వచ్చాడు. వివాహం పూర్తయిన తర్వాత తదుపరి సాంప్రదాయాలను కూడా పూర్తిచేసి అలీ తన కుమార్తెను అల్లుడిని అమెరికాకు సాగనంపాడు. ఈ క్రమంలో అలీ కూతురు అమెరికాకు పయనమైన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అలీ దంపతులు తమ కూతురికి వీడ్కోలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.