సినిమా రేంజ్ లో ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్… వైరల్ అవుతున్న వీడియో?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి హీరోలు పలు యాడ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పలు ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇలా యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తూ ఉన్నారు. ఇక ఇదే కోవలోకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా.ఎన్టీఆర్ ఇదివరకే ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇకపోతే ఈయన మరో యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ కూడా ఫుడ్ డెలివరీ యాడ్ చేసినట్టు తెలుస్తుంది.

పాపులర్ ఇండియన్ ఫుడ్ డెలివరీ “హబ్ లిసియస్ ఫుడ్స్” కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ యాడ్ ఏకంగా టెంపర్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపిస్తుందని చెప్పాలి. ఈ యాడ్లో కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా కనిపిస్తున్నారు. ఇక డైలాగ్ అని చెప్పగానే ఎన్టీఆర్ కాస్త తడబడినట్లు చూపించారు.

ఇలా ఎన్టీఆర్ తబడటంతో రాహుల్ రామకృష్ణ ఆరు పేజీల డైలాగులను కూడా ఎంతో అవలీలుగా చెప్పే మీరు ఇలా ఎందుకు తడబడుతున్నారు అంటూ ప్రశ్నించగా వెంటనే ఎన్టీఆర్ చేప చిన్నదైనా ఎర పెద్దది వేయాలంటూ లిసియస్ ఫుడ్ యాప్లో చేపలను గురించి వివరించే ప్రయత్నం చేశారు. డైలాగ్ చిన్నదే అయిన డైలెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి అచ్చం నాలాగే అంటూ ఈయన చెప్పిన డైలాగ్ అచ్చం సినిమాని తలపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.