కూతుర్ని చూడాలంటే కండిషన్లు పెట్టిన ఆలియా భట్ దంపతులు.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్?

బాలీవుడ్ నటి అలియా భట్ గత ఆదివారం కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రణబీర్ కపూర్ తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈమె పెళ్లయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించారు.అయితే ఈమె పెళ్లి జరిగిన 7 నెలలకే బిడ్డకు జన్మనివ్వడంతో ఈమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ ట్రోల్ చేశారు. ఇకపోతే గత ఆదివారం ఈమె ముంబైలోనే రిలయన్స్ హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చారు. ఇక గురువారం తన బిడ్డతో కలిసి అలియా భట్ దంపతులు తమ నివాసానికి చేరుకున్నారు.

ఇకపోతే అలియా భట్ తన కుమార్తెతో ఇంటికి వెళ్లారు అనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున సన్నిహితులు బంధువులు తన కుమార్తెను చూడటానికి వెళ్తున్నారట అయితే ఇలా తన కుమార్తెను చూడటానికి వెళ్లిన వారికి ఈ దంపతులు ఒక కండిషన్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఎవరైతే తన కూతురును చూడటానికి వస్తారో వారు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్లాలని ఈ దంపతులు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇలా తమ చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అలియా భట్ దంపతులు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే తన కూతుర్ని చూడటానికి అనుమతిస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున నేటిజన్లో సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులపై ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా వీరి నిర్ణయంతో స్నేహితులు బంధుమిత్రులు కూడ చిన్నపాటి అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.