Alcohol: 21 రోజులు మద్యం తాగడం మానేస్తే.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!

ప్రస్తుతం యువతలో మద్యం తాగడం ఒక ఫ్యాషన్‌లా మారిపోయింది. పండుగలు, పుట్టిన రోజులు, పార్టీలంటే మద్యం తప్పనిసరి అయింది. కానీ దీని వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావం ఏ స్థాయిలో ఉందో చాలామందికి తెలియదు. ముఖ్యంగా రోజూ మద్యం తాగే వారికి అది చిన్నచిన్న అనారోగ్యాల నుంచీ, ప్రాణాంతక వ్యాధుల వరకు దారి తీస్తుంది. అయితే శరీరానికి తాళం వేసినట్టు కనిపించే ఈ అలవాటు.. కేవలం 21 రోజులు ఆపేస్తేనే ఎంత అద్భుతమైన మార్పులు జరిగుతాయో చాలా మందికి తెలియదు.

ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. మీరు మద్యం మానేయగానే మీ జీర్ణశక్తి మెరుగవుతుంది. మొదటి వారం కొద్దిగా తలనొప్పులు రావచ్చు. కానీ ఇది కాలేయం శుభ్రం అవుతున్న సూచన. వారం గడిచాక నిద్ర గుణాత్మకంగా మారుతుంది. మందు తాగి పడుకుంటే వచ్చే డిస్టర్బ్‌డ్‌ డ్రీమ్స్ మాయమవుతాయి. బదులు చక్కటి కలలు కలుగుతాయి. ఆకలి కూడా కాస్త పెరుగుతుంది. ఆహారం మీద ఆసక్తి ఎక్కువవుతుంది.

21 రోజులు ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే ముఖం అందంగా మారుతుంది. ఎందుకంటే మద్యం రక్త ప్రసరణను దెబ్బతీయడం వల్ల చర్మానికి ఆక్సిజన్ సరిపడదు. ఆ ప్రభావం తాగడం మానేసిన వారం నుంచి తగ్గిపోతుంది. ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. ముఖానికి సహజమైన వెలుగు తిరిగి వస్తుంది.

మద్యం వల్ల ఎక్కువగా దెబ్బ తినేది కాలేయం. ఇది రోజూ ఆల్కహాల్‌ను ఫిల్టర్ చేస్తూనే అలసిపోతుంది. కానీ 21 రోజులు దానికి విశ్రాంతి ఇస్తే, అది తిరిగి క్రమంగా సులభంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారు ఇన్ఫెక్షన్లకు, జలుబులకు, ఇతర వైరస్‌లకు సులభంగా లోనవుతుంటారు. కాబట్టి దాన్ని మానేస్తే దేహ రక్షణ వ్యవస్థ బలంగా మారుతుంది.