అక్కినేని వారసులకు సినిమాలు ఇష్టం లేదా… అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా నాగార్జున సినిమా రంగ ప్రవేశం చేసి అద్భుతమైన నటన శైలితో టాలీవుడ్ అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్నారు. ఈ తరం కథానాయకుల్లో నాగచైతన్య, అఖిల్ నాగార్జున నట వారసులుగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ కెరీర్ పరంగా కాస్త వెనుక పడ్డారని చెప్పొచ్చు. ఈమధ్య కాలంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమా మినహా అన్ని సినిమాల డిజార్డర్ గా నిలవడంతో అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది అంటూ అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ నెలకొంది. నాగార్జున బిగ్ బాస్ షో దూసుకుపోతుండడంతో ఒకింత అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి బయలుదేరిన నాగచైతన్య, అఖిల్ సక్సెస్ సాధించలేకపోవడానికి కారణం అసలు వీరికి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదన్న వాదన నడుస్తోంది. కారణాలు పరిశీలిస్తే నాగచైతన్యకు కార్ రేసింగ్ అంటే బాగా ఇష్టం.కార్ రేసింగ్‌లో ఇండియా స్థాయి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. అయితే నాగార్జున బలవంతంగా చైతును హీరోను చేశాడు. మొదట్లో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినప్పటికీ తర్వాత కథల ఎంపిక విషయంలో నాగచైతన్యకు సరైన అవగాహన లేదని అభిమానులు చెబుతుంటారు. దానికి తోడు సమంత బ్రేకప్ తో పర్సనల్ లైఫ్ లో కూడా వెనకబడ్డారని చెప్పొచ్చు.

ఇక అఖిల్ విషయానికొస్తే ఇండస్ట్రీలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా వచ్చిన బ్యాచిలర్ సినిమా ఓ మోస్తారుగా ఆడినప్పటికీ అఖిల్ కు తగిన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. ఇక ఏజెంట్ సినిమా రెండేళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తూనే వస్తుంది చివరకు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవంటూ ప్రచారం జరుగుతుంది. అఖిల్ క్రికెట్ పై ఉంచిన శ్రద్ధ సినిమాల్లో కనిపించలేదని ప్రచారం సాగుతోంది. క్రికెట్ అంటే ఇష్టం ఉండొచ్చు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత సినిమానే కెరీర్‌గా మలుచుకోవాల్సింది పోయి ఓ వైపు సినిమా షూటింగ్ జరుగుతుంటే గ్యాప్‌లో వచ్చి క్రికెట్ చూస్తూ ఉంటాడట. ఇలా అయితే అక్కినేని ఫ్యామిలీ సినిమాల్లో రాణించడం చాలా కష్టం అంటున్నారు అక్కినేని అభిమానులు..