Akkineni Akhil:అఖిల్ సరసన మెరవనున్న జాన్వీకపూర్..!

Akkineni Akhil: అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని అఖిల్.అఖిల్ తో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ప్రిన్స్ ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్ ను అందుకోవడం లో విఫలం అయ్యాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సక్సెస్ అయినా కూడా అభిమానులకు అది సరిపోలేదు. ఓ రేంజ్ సక్సెస్.. వంద కోట్ల సినిమాలను అఖిల్ నుండి అభినులు ఆశిస్తున్నారు.

ఇక అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైయింది. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్, అఖిల్ తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అక్కినేని అఖిల్ పక్కన హీరోయిన్ గా అతిలోక సుందరి కూతురు అయిన జాన్వీకపూర్ ను అనుకుంటున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్ గా నటిస్తుందని మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇలా చాలా మంది హీరోల సినిమాల్లో గాంధీ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి,కానీ అవేవీ నిజం అవ్వలేదు. ఇప్పుడు కరణ్ జోహార్ అఖిల్ జాన్వికపూర్ జోడి నీకు కుదిరినట్టు సమాచారం బలంగా వినిపిస్తోంది. ఇటీవల జాన్వికపూర్ తండ్రి బోనీ కపూర్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు జాన్వి తెలుగు సినిమా ఎంట్రీ త్వరలోనే ఉంటుందని సమాచారం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే జాన్వీ కపూర్ అఖిల్ సినిమాలో నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తి అయిన వెంటనే కరణ్ జోహార్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ మొదలవుతుంది. అఖిల్ జాన్వీ కపూర్ జోడీ కుదిరితే దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. గతంలో శ్రీదేవి, నాగార్జున జంట ఎంతగా అలరించినా అందరికీ తెలిసిందే ఇప్పుడు వారి వారసులుగా జాన్వికపూర్,అఖిల్ జంట ఎలా ఉంటుందో వేచి చూడాలి.