Akkineni Akhil:అఖిల్ ‘ఏజెంట్ ‘సినిమా విడుదల ఎప్పుడంటే..?

Akkineni Akhil:అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని అఖిల్.అఖిల్ తో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ప్రిన్స్ ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్ ను అందుకోవడం లో విఫలం అయ్యాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సక్సెస్ అయినా కూడా అభిమానులకు అది సరిపోలేదు. ఓ రేంజ్ సక్సెస్.. వంద కోట్ల సినిమాలను అఖిల్ నుండి అభినులు ఆశిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న చిత్రం ఏజెంట్.స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా హై బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతంహైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తుండడం విశేషం.అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా.. వక్కంతం వంశీ కథ అందించారు.

తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో అఖిల్ మొట్టమొదటిసారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో దేశభక్తి సంబంధించిన అంశాలు ఉండడం వల్ల చిత్రం విడుదలకు ఆగస్టు 12 సరైన సమయం అని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.