బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అయినప్పుడు కాస్త చప్పగానే ఉండేది. కానీ.. రోజులు గడుస్తున్నా కొద్దీ.. షో మీద ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలుగుతోంది. దానికి కారణాలు కూడా లేకపోలేవు. ఒకటి హౌస్ లో జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాగా.. మరోటి కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న గొడవలు.
ఏది ఏమైనా బిగ్ బాస్ 4 లో ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఉన్న పాపులారిటీ దేనికీ లేదు. అఖిల్, మోనల్, అభిజీత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అయితే.. తర్వాత తెలిసింది ఏంటంటే? అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు.. సింగిల్ ట్రాకే అని తెలిసింది. ఎందుకంటే.. అభిజీత్ ప్రస్తుతం హారిక ప్రేమలో మునిగి తేలుతున్నాడు. దీంతో మోనల్, అఖిల్ లవ్ ట్రాక్ కు క్లియరెన్స్ వచ్చేసింది.
హౌస్ లో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసు కదా. ఈ షోను చూస్తున్న అఖిల్ పేరెంట్స్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారట. ఎందుకంటే.. అఖిల్, మోనల్ ప్రేమ వాళ్లకు నచ్చడం లేదట.
నిజానికి బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడానికి ముందునుంచే అఖిల్ కు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారట. అఖిల్ కు అచ్చమైన పదహారణాల తెలంగాణ అమ్మాయి కోసం అఖిల్ తల్లిదండ్రులు వెతుకుతున్నారట. మోనల్ గజ్జర్ వాళ్లకు ఇష్టం లేదట.
అంటే.. అఖిల్, మోనల్.. నిజంగా ప్రేమించుకున్నా.. వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకునేలా లేరు. ఖచ్చితంగా అఖిల్ కు తాము చూసిన అమ్మాయితోనే పెళ్లి చేస్తారట. అందుకే.. అఖిల్.. హౌస్ నుంచి రాగానే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారట. అయితే.. అఖిల్, మోనల్ ప్రేమ కేవలం బిగ్ హౌస్ కే పరిమితం కానుందా?