బిగ్ బాస్ 4: అందరి ముందు మోనాల్‌ని అవ‌మానించిన అఖిల్ త‌ల్లి.. ఆశ‌లు అడియాశ‌లేనా?

తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్-మోనల్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ఇద్దరిపై ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుస్తున్నారు కానీ బహిరంగంగా చెప్పుకోవడం లేదు. హౌస్‌లో కాస్త స్పైసీ కంటెంట్ ఇచ్చేది కూడా ఈ జంటే. అడక్కుండానే ముద్దులు, హగ్గులు ఇస్తోన్న మోనల్‌ను బిగ్ బాస్ ఎలా బయటకు పంపిస్తాడు చెప్పండి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇవి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా…రేటింగ్ కోసం ఫుటేజ్ ప్లే చేస్తున్నారు. ఇటీవల తన బర్త్‌డే రోజున కేక్ కటింగ్ చేసిన అనంతరం.. ఏకాంతంగా ఉన్నప్పుడు మోనాల్‌ను కౌగిలించుకోమని కోరాడు అఖిల్. ఆమె హగ్గుతో సరిపెట్టలేదు..ముద్దుల వర్షం కూడా కురిపించింది. దీంలో అఖిల్ ఫేస్ లో మంచి జోష్ కనిపించింది. ఇవే కదా యూత్‌కు కావాల్సిన సీన్లు.

బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకుల కోసం ఎమోషనల్ గురువారం ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. కంటెస్టెంట్లును వారి కుటుంబ సభ్యులతో కలిపించి ఎపిసోడ్‌ను రక్తి కట్టించారు. గత రాత్రి ఎపిసోడ్లో అఖిల్, అవినాష్, అభిజీత్, హరిక… వారి పేరెంట్స్‌ను కలిశారు. ఈ క్రమంలో అఖిల్ తల్లి హరికతో ‘నాకు కుమార్తె లేదు, ఉంటే నీ లాంటి కుతురే ఉండాలని కోరుకుంటాను’ అని చెప్పింది. దీంతో హారిక ఆనందంతో పిల్లిమొగ్గలు వేసింది. ఈ క్రమంలో హారికను ప్రశంసిస్తూ అఖిల్ తల్లి మోనాల్ గజ్జర్‌ను పరోక్షంగా అవమానించారని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మోనాల్‌కు అఖిల్‌కు సమ్‌థింగ్..సమ్‌థింగ్ ఉంద‌న్న వార్త‌ల‌కు చెక్ పెడుతూ మోనాల్ త‌న కొడుక్కి మంచి స్నేహితురాలు అని పదేపదే చెప్పే ప్రయత్నం చేసింది.

కాగా అఖిల్ రిలేషన్‌తో అతడి తల్లిదండ్రులు హ్యపీగా లేరని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అదే విషయాన్ని ఆమె అక్కడ ఇన్‌డైరెక్ట్‌గా వ్యక్తపరిచారని చెబుతున్నారు. వారు స్వచ్ఛమైన తెలంగాణ మాండలికం అమ్మాయి కావాలని ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ ద్వంద వైఖరి అఖిల్‌ తల్లికి నచ్చలేదని..అందుకే అలా మాట్లాడారని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి ఎమోషనల్‌ ఎపిసోడ్‌లో ఒక క్లారిటీ కూడా వచ్చింది. మరి బయటకు వెళ్లాక ఈ విషయాన్ని మోనల్, అఖిల్ ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఇక నేటి ఎపిసోడ్‌లో మిగిలిన‌వారి పేరెంట్స్ రానున్న‌ట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది