బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రాంతీయ భాషలలో దూసుకెళుతుంది. పరిచయాలలేని పదిహేను మందిని తీసుకొచ్చి ఓ ఇంట్లో ఆడేసి వారితో బిగ్ బాస్ ఆడిస్తున్న గేమ్స్ ప్రేక్షకులకి చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో సీజన్ 4 నడుస్తుండగా, ఈ షోపై తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. విజేతలుగా ఎవరు నిలుస్తారు, టాప్ 5లో ఎవరుంటారనే దానిపై జోస్యాలు చెబుతున్నారు. అయితే ఉన్నవాళ్లలో అఖిల్, అభిజీత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా కనిపిస్తుండగా, వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. మధ్యలో కలిసిన మళ్ళీ బిగ్ బాస్ పెట్టిన నిప్పుకు ఇద్దరు విరోధులుగా మారారు.
సీజన్ 4లో డే 1 నుండి అఖిల్- అభిజీత్‌కు అస్సలు పడేది కాదు. అఖిల్ కావాలని అభీని టార్గెట్ చేస్తున్నాడని బయటి ప్రేక్షకులు భావిస్తున్నారు. సీక్రెట్‌రూంలో నుండి చూసి వచ్చి అభితో ఆ రకంగా దురుసుగా మాట్లాడడం కరెక్ట్ కాదని ఓ వర్గం ఆరోపణ. గతంలో శ్రీముఖి కూడా ఇలానే రాహుల్‌ని టార్గెట్ చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు శ్రీముఖిని తప్పించి రాహుల్‌కి పట్టం కట్టారు. ఇప్పుడు ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అఖిల్ రన్నరప్ అవుతాడా అంటూ అంచనాలు వేస్తున్నారు. ఈసారి నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ ఎక్కువమందికి టార్గెట్ కావడంతో అతను వన్ ఆర్మగా పోటీ చేస్తున్నాడని జనాలు కాస్త జాలి చూపిస్తున్నారు
రోజు రోజుకు అభిజిత్ గ్రాఫ్ పెరుగుతూ పోతుండడం, అఖిల్.. అభిజీత్‌ని టార్గెట్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడం ప్రేక్షకులకు అభిపై సింపథీ పెరిగేలా చేస్తుంది. “మేక పులి అవ్వదు..బలి అవుతుంది” అని అఖిల్‌ను ఉద్దేశించి అభి అన్న డైలాగ్ ఓ స్టార్ హీరో టీజర్ మాదిరి సూపర్ క్లిక్ అయ్యింది. ఇన్నాళ్ళు ఫిజికల్ టాస్క్‌లలో సైలెంట్‌గా ఉన్న అభిజీత్ తనెంటో నిరూపించుకునేందుకు ఫిజికల్‌గా కూడా బాగా ఆడుతున్నాడు. నిన్నటి టాస్క్‌లో అభి ప్రదర్శన ఆయనపై మరింత అభిమానం పెరిగేలా చేసింది. ఏదేమైన అఖిల్ పదే అభిజీత్‌పై ఆరోపణలు చేస్తూ పోతే అతనికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు