Akhil&Chaithanya:పోటీపడుతున్న చైతన్య,అఖిల్.. ఎవరి సినిమా హిట్ అవుతుందో..?

Akhil&Chaithanya:మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న చిత్రం ఏజెంట్.స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా హై బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతంహైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తుండడం విశేషం.అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం,సుంకర నిర్మిస్తుండగా.. వక్కంతం వంశీ కథ అందించారు. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఆగస్ట్ 11వ తేదీ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ విడుదల కాబోతోంది. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తొలిసారి అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అతనో కీలక పాత్ర పోషించాడు.  అందువల్ల ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.కేవలం తెలుగు వెర్షన్ కోసమే చైతన్య రోల్ ను పెంచుతున్నారు. కాబట్టి నాగ చైతన్య- అఖిల్ ల మధ్య గట్టిపోటీ ఏర్పడడం ఖాయం.

మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఎక్కువగా ‘లాల్ సింగ్ చద్దా’ కే ఓటేసే అవకాశం ఉంటుంది.  కానీ సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబోలో గతంలో ‘కిక్’, ‘రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కాస్తంత గ్యాప్ తర్వాత వీరిద్దరూ ‘ఏజెంట్’కు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉంటాయి. మరి అభిమానులు ఎవరి సినిమాకి ఓటేస్తారో చూడాలి.