Bigg boss 4: అఖిల్, మోనాల్ ఘాటైన ముద్దు.. షాకైన ఇంటి సభ్యులు?

akhil and monal kiss in bigg boss house

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అదే బిగ్ బాస్ అంటే. ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు? ఎప్పుడు బిగ్ బాస్ ఏ టాస్క్ ఇస్తాడు? అనేది ఎప్పటికీ సస్పెన్సే. అవే కాదు.. బిగ్ బాస్ హౌస్ లో జరిగే ప్రతిదీ సస్పెన్స్ గానే ఉంటుంది. అందుకే ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ పై ఆసక్తి చూపిస్తుంటారు. షాక్ ల మీద షాక్ లు.. సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లతో ప్రస్తుతానికి బిగ్ బాస్ షో బాగానే నడుస్తోంది.

akhil and monal kiss in bigg boss house
akhil and monal kiss in bigg boss house

మొత్తానికి మెహబూబ్ ను పంపించేశారు. ఇక మిగిలింది… అభిజీత్, అఖిల్, సొహెల్, అవినాష్, అరియానా, హారిక, లాస్య, మోనాల్. ఉన్నది 8 మంది. వీళ్లలో ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి అఖిల్, అవినాష్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.

ఇక.. తాజాగా కమాండర్ ట్రెయినింగ్ అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇంటిసభ్యులకు ఇచ్చాడు. ఈ టాస్క్ లో అభిజీత్, అఖిల్, హారిక బాగా చేయడంతో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కు వాళ్లు డైరెక్ట్ గా అర్హులయ్యారు.

అయితే.. మంగళవారం అఖిల్ బర్త్ డే కావడంతో… బిగ్ బాస్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అఖిల్ కు కేక్ పంపించి.. ఇంటి సభ్యులతో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పడంతో.. ఇంట్లో ఒక్కసారిగా సందడి నెలకొంది.

akhil and monal kiss in bigg boss house
akhil and monal kiss in bigg boss house

అయితే.. అందరూ ముందు మోనాల్ కు కేక్ తినిపిస్తాడని అనుకున్నా… అఖిల్ మాత్రం తన తనే ముందు తినేశాడు. తర్వాత మోనాల్ అఖిల్ ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టింది. దీంతో నెటిజన్లు మాత్రం షాక్ అయ్యారు. అయ్యబాబోయ్.. ఏంటిది.. మోనాల్ కు రొమాన్స్ తప్పించి ఇంకేం చేయడం రాదా? అని ట్రోల్ చేస్తున్నారు.

బిగ్ బాస్ దయచేసి మోనాల్ ను ఎలిమినేట్ చేయండి.. ప్లీజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి.. మోనాల్.. బిగ్ బాస్ కు, నాగార్జునకు ఫేవరేట్ కంటెస్టెంట్ కావడంతో తను ఈ షోను ఇప్పటి వరకు ఎలిమినేట్ కాలేదు. తను టాప్ 5 లో ఉన్నా కూడా మనం నోరెళ్లబెట్టడానికి చాన్స్ లేదు. ఎందుకంటే… బిగ్ బాస్ హౌస్ లో అందాలను ఒలకబోసేది ఒక్క మోనాల్ మాత్రమే.