రజినీ రాగానే కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్!

ఐశ్వర్యారాయ్ పరిచయం అవసరం లేని పేరు మాజీ ప్రపంచ సుందరిగా బాలీవుడ్ అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ అమితాబచ్చన్ ఇంటి కోడలుగా మారిపోయారు. ఇలా అమితాబ్ ఇంటి కోడలుగా వెళ్లిన ఐశ్వర్య వివాహం తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక కేవలం ఈమె బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించారు. ఇకపోతే తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వమ్ అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం తాజాగా చెన్నైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో సందడి చేసిన ఐశ్వర్యరాయ్ వేదిక పైకి రజినీకాంత్ రాగానే ఒక్కసారిగా తన కాళ్లకు నమస్కారం చేసింది.

ఈ విధంగా ఐశ్వర్య రాయ్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఏమాత్రం ఇగో చూపించకుండా రజనీకాంత్ రావడంతో ఒక్కసారిగా తన కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పైకి లేచి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు.ఇలా ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ పట్ల వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లో ఐశ్వర్యరాయ్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ఈమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన స్టార్ డమ్ పక్కనపెట్టి ఇలా రజినీకాంత్ కు పాదాభివందనం చేయడంతో ప్రతి ఒక్కరూ తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.