ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ ఏ లెవెల్ లో ఉందో అందరికీ తెలిసిందే. తెలుగు నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రపంచం మొత్తం ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసే పొజిషన్లో ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఒకప్పుడు మేము తోపు అంటూ కాలర్ ఎగరవేసిన బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం టాలీవుడ్ శాసిస్తోంది. అదే విషయం తెలుగు నిర్మాత అయిన నాగ వంశీ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పటంతో పాపం బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కి ఎక్కడో కాలినట్లు ఉంది.
మా బాలీవుడ్ గొప్ప అంటూ మాట్లాడబోయిన బోని కపూర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి నోరు ముగించాడు నాగ వంశీ. అసలు ఏం జరిగిందో చూద్దాం.తాజాగా ఓ మీడియా సంస్థ పెట్టిన రౌండ్ టేబుల్‌లో ఈ ఇయర్ వచ్చిన చిత్రాల గురించి చర్చించుకున్నారు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రతినిధులు ఇందులో ఉన్నారు. చర్చల్లో భాగంగా నాగవంశీ బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్‌కు కౌంటర్ వేశారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కాస్త ఇబ్బంది పెట్టేలా అనిపించినా ఇది నిజం, మీరు ఇంకా ఆ బాంద్రా, జుహులోను ఇరుక్కుపోయారు.
అక్కడే ఆగిపోయారు, మా సౌత్ మేకర్లే ఇప్పుడు మీకు కొత్త దారిని చూపిస్తున్నారు అని నాగవంశీ నేరుగానే కౌంటర్లు వేశాడు. ఆ మాటలకి బోని కపూర్ కి ఎక్కడో కాలినట్లుగా ఉంది, నిజాన్ని ఒప్పుకోకుండా కొత్తదనం ఎప్పటినుంచో బాలీవుడ్ లో ఉంది అని చెప్పాడు. అయితే నాగ వంశీ ఊరుకోకుండా ఇప్పుడు బాహుబలి, పుష్ప, సాలార్, యానిమల్ ఇవన్నీ సౌత్ నుంచి వచ్చినవే కదా అనటంతో గద్దర్ , పటాన్, జవాన్ గురించి చెప్పుకొచ్చాడు బోనీకపూర్. అందులో జవాన్ మా అట్లీ తీసిందే అంటూ ఓ రేంజ్ లో సమాధానం చెప్పాడు నాగ వంశీ.
అయితే బోనికపూర్ ఊరుకోకుండా పుష్ప సినిమా హీరో మా అమితాబచ్చన్ కి పెద్ద ఫ్యాన్ అంటూ లాజిక్ తీసాడు. అయితే నాగ వంశీ ఆయనకు తగిన సమాధానం చెప్పినప్పటికీ టాలీవుడ్ ఆధిపత్యాన్ని ఒప్పుకునేటట్లు కనిపించలేదు బోని కపూర్. అయితే నాగ వంశీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఒక్కరోజులోనే పుష్ప సినిమా 84 కోట్లు కలెక్షన్ సాధించడంతో బాలీవుడ్ కి రాత్రి నిద్ర పట్టి ఉండదు అని నవ్వుతూ మరో కౌంటర్ వేసేసాడు.
‘You guys (Bollywood) are stuck in making films for Bandra & Juhu’ – Harsh Reality!! pic.twitter.com/VwEZNWAHk3
— Aakashavaani (@TheAakashavaani) December 30, 2024