రూమర్స్‌కు చెక్‌ పెట్టిన ఐశ్వర్య-అభిషేక్‌.. ఒకే ప్రేమ్‌లో ఇద్దరు

బాలీవుడ్‌ స్టార్‌ జంట ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ ఐశ్వర్య అభిషేక్‌ జంట ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు.

వీరిద్దరూ కలిసి తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇద్దరూ బ్లాక్‌ డ్రెస్‌లు ధరించి ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఐశ్వర్య తల్లి బృంద్య, అను రంజన్‌తో కలిసి ఈ స్టార్‌ జంట సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ జంట విడాకులు తీసుకోబోతున్నదంటూ ఇటీవల వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అభిషేక్‌ నటి నిమ్రత్‌ కౌర్‌తో రిలేషన్‌లో ఉన్నాడని.. ఈ క్రమంలోనే ఐష్‌ నుంచి విడిపోనున్నట్లుగా బాలీవుడ్‌ కోడై కూస్తున్నది.

ఈ క్రమంలోనే ఏ పార్టీకి హాజరైనా బచ్చన్‌ ఫ్యామిలీ కుటుంబంతో సహా హాజరవుతున్నా.. ఐశ్వర్య మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా హాజరవడం ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. అలాగే, ఒక్కగానొక్క కూతురు ఆరాధ్య బర్త్‌ డే వేడుకలకు సైతం అభిషేక్‌ దూరంగా ఉన్నాడు. దీంతో ఈ జంట త్వరలో విడాకులు తీసుకోవడం ఖాయం అని అందరూ భావించారు. ఇంతలోనే ఇద్దరూ ఓ కార్యక్రమానికి హాజరై ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు.