Abhishek Bachchan: ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా.. అలా ఉండడం నాకు కుదరదు: అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల కాలంలో వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా ఈయన సోషల్ మీడియా ఎక్కువగా కనిపించరు. కానీ ఈ మధ్యకాలంలో ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు అభిషేక్ బచ్చన్. ఇది ఇలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. నేను నా చుట్టు ఉన్నవారిని సంతోషంగా ఉంచాలని ఎప్పుడూ కోరుకుంటాను. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు కాలమే మనకు కఠినంగా ఉండమని చెబుతుంది. ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు. అలా ఉంటే ఆ ప్రభావం నా కెరీర్‌ పై పడుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలనే మనస్తత్వం నాది. నెగెటివ్‌ విషయాలు చెప్పే వారి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని, ట్రోలింగ్‌ పై కూడా దృష్టిపెట్టేవాడిని.

కానీ నా భార్య ఐశ్వర్య ఇచ్చిన ఒక సలహాతో వాటిని దూరం పెట్టేశాను. తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్‌ విషయాలపై మాత్రమే దృష్టిపెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాను. ట్రోలింగ్‌ ని పట్టించుకోకుండా ఎంజాయ్‌ చేస్తున్నాను. ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడం నా వల్ల కాదు. కుటుంబాన్ని చూడకుండా ఉండలేను. నా పక్కన మాట్లాడడానికి ఒక మనిషి కచ్చితంగా ఉండాలి. ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాం. వర్క్‌ బిజీగా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు మనకోసం కూడా సమయం కేటాయించుకోవాలి అని అభిషేక్‌ తెలిపారు.