“ఏజెంట్” ఓటిటి వెర్షన్ లో భారీ మార్పులు.?

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని ఫామిలీ నుంచి యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన భారీ చిత్రం “ఏజెంట్” కూడా ఒకటి. తమ కుటుంబంలోనే హైయెస్ట్ బిజినెస్ ని రికార్డు చేసిన ఈ చిత్రం హైయెస్ట్ నష్టాలు కూడా మిగిల్చి ట్రేడ్ కి షాకిచ్చింది.

అయితే ఈ సినిమా ఫలితాన్ని ముందే ఊహించినప్పటికీ మేకర్స్ చేసేది ఏమీ లేక ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మరి అనుకున్నట్టుగానే భారీ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. కాగా వెంటనే ఈ సినిమా ఓటిటి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుంది. అయితే సోని లివ్ లో ఈ చిత్రం ఈ మే 19నే రావాల్సి ఉండగా మేకర్స్ దీనిని కూడా వాయిదా వేశారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డేట్ జూన్ 23కి లాక్ కాగా ఈసారి ఏజెంట్ ప్రింట్ లో భారీ మార్పులు ఉంటాయి అని సినీ వర్గాలు చెప్తున్నాయి. థియేట్రికల్ గా లాస్ట్ మినిట్ లో కొన్ని ప్రెజర్స్ మూలాన యాడ్ చేయలేని కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్స్ ని అయితే ఈ ప్రింట్ కి కరెక్ట్ చేసి రిలీజ్ చేయబోతున్నారట.

అందుకే ఏజెంట్ ఓటిటి రిలీజ్ ఆగింది అని తెలుస్తుంది. అలాగే ఇందులో చాలానే మార్పులు చేయడమే కాకుండా పూర్తిగా థియేట్రికల్ వెర్షన్ కి కొత్త సినిమాగా ఇది ఉంటుంది అని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు. అలాగే సాక్షి వైద్య అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.