రెండ్రోజుల్లో ఏజెంట్ ఎంతమేర వసూళ్లను రాబట్టిందంటే?

అఖిల్ అక్కినేని హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఏజెంట్. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదల కాగా నెగిటివ్ టాక్ వస్తోంది. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.

నెగిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం మొదటి రోజు ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.4 కోట్లు షేర్ రాబట్టగా, రెండో రోజు రూ.67 లక్షలు మాత్రమే రాబ్టటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో మొత్తం రూ.4.67 కోట్ల షేర్ ను సాధించగా రూ.7.90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

రెండోరోజు నైజాంలో 21 లక్షలు, సీడెడ్ లో 8 లక్షలు, యూఏలో 11 లక్షలు, తూర్పులో 7 లక్షలు, పశ్చిమలో 5 లక్షలు, గుంటూరులో 7 లక్షలు, కృష్ణలో 5 లక్షలు, నెల్లూరులో 3 లక్షలు రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.0.67 కోట్లు షేర్ ను వసూలు చేసింది. అలాగే రూ.1.30 గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత మేర రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

నైజాంలో రూ.1.54 కోట్లు, సీడెడ్ లో 72 లక్షలు, యూఏలో 65 లక్షలు, పశ్చిమ 35 లక్షలు, గుంటూరులో 59 లక్షలు, కృష్ణలో 27 లక్షలు, నెల్లూరులో 19 లక్షలు రాబట్టింది. ఇలా రెండ్రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.67 కోట్ల షేర్ ను రాబట్టగా రూ.7.90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రెండ్రోజుల్లో రూ.0.34 కోట్లు, ఓవర్సీస్ లో రూ.0.75 కోట్లు రాబట్టుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రెండ్రోజుల్లో రూ.5.76 కోట్ల షేర్ ను సాధించింది. మొత్తం రూ.10.25 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

సినిమా మొత్తం వాల్యూడ్ బిజినెస్ రూ.36.20 కోట్లు కాగా.. బ్రేక్ ఈనెన్ రూ.37 కోట్లకు ఫిక్స్ అయింది. అఖిల్ ఏజెంట్ సినిమా హిట్టుగా నిలవాలంటే మరో రూ.31.24 కోట్లు రావాలి. నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తుందని.. సినిమా ఆడడం చాలా కష్టమేనని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరోసారి అఖిల్ కు ఏజెంట్ ద్వారా గట్టిగానే దెబ్బ తగిలిందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.