మరో సారి వివాదాల్లో విజయ్ దేవరకొండ పేరు.!

టాలీవుడ్ లో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి పలువురు హీరోలకి ధీటుగా నిలబడడం అనేది చిన్న విషయమేమి కాదు. మరి అలాంటి హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవర కొండ బాగా సక్సెస్ అయ్యాడు. ఎప్పుడో ఏవో చిన్న చిన్న పత్రాలు చేస్తూ వచ్చిన తాను ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు.

అయితే అర్జున్ రెడ్డి సినిమా దెబ్బలకి తన దశ తిరిగింది కానీ అక్కడ నుంచి తనకి వివాదాలు కూడా ప్రతి సినిమాకి ఏదొక అంశంలో వస్తూనే ఉన్నాయ్. కానీ వాటిని ధీటుగా తాను హ్యాండిల్ చేస్తూ వచ్చాడు. అయితే తన కెరీర్ లో ఇప్పటికీ అతి పెద్ద హిట్ ఏదన్నా ఉంది అంటే అది “గీత గోవిందం” అనే చెప్పాలి.

ఈ సినిమా కూడా పైరసి వివాదాల్లో ఇరుక్కుంది. అలా ప్రతి సినిమాకి ఏదొకలా కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్న తాను ఇప్పుడు మరోసారి వివాదాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇదే గీతా గోవిందం సినిమా సీక్వెల్ ని విజయ్ మరియు దర్శకుడు పరశురామ్ లు నిర్మాత దిల్ రాజు తో అనౌన్స్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.

గతంలో అల్లు సంస్థ కి మాటిచ్చి ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ తో దానిని లాక్ చేయడం అనేది సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనితో మరోసారి విజయ్ కి కాంట్రవర్సీ లు తప్పలేదు అంటూ చర్చ నడుస్తుంది. ఇక మరోపక్క విజయ్ దర్శకుడు శివ నిర్వాణ తో “ఖుషి” సినిమా హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.