హాలీవుడ్ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన సమంత..!

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఓ సైడ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్లిన నటి సమంత. అయితే ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొఫిషనల్ గా మాత్రం సమంత ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికీ ఎన్నో సినిమాలు ఆఫర్స్ అందుకుంటూ పాన్ ఇండియా వైడ్ గా దూసుకెళ్తుంది.

మరి ఇదిలా ఉండగా సమంత హీరోయిన్ గా నటించిన రీసెంట్ చిత్రం “ఖుషి” తో హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి రాగా సమంత ఇప్పుడు తన ట్రీట్మెంట్ ని కూడా తీసుకుంటుంది. అయితే ఈ గ్యాప్ లో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే సమంత ఇచ్చింది. దీనితో ఇన్నాళ్లు ఒక నటిగా కనిపించిన సమంత మొదటిసారిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అయితే మారింది.

అది కూడా ఓ హాలీవుడ్ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. హాలీవుడ్ లో సూపర్ హీరోస్ సినిమాలు అంటే గుర్తొచ్చేది మార్వెల్ చిత్రాలు అందులో సూపర్ హీరోలు మరి వారిలో లేడీస్ కూడా చాలా పవర్ ఫుల్ అలా వారిపై చేసిన లేటెస్ట్ చిత్రం “ది మార్వెల్స్” మరి ఇప్పటికే కెప్టెన్ మర్వెల్ అనే చిత్రం వచ్చి మంచి సక్సెస్ సాధించగా దానికి సీక్వెల్ గా ఇది వస్తుంది.

అయితే ఇందులో కమాలా  ఖాన్ అనే లేడీ యంగ్ సూపర్ హీరో పాత్రకి తెలుగులో సమంత డబ్బింగ్ చెప్పిందట. దీనితో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే సమంత తనకి డబ్బింగ్ చెప్పించుకునే స్టేజి నుంచి తాను డబ్బింగ్ చెప్పే లెవెల్ కి ఎదిగింది అని కొన్ని కామెంట్స్ బాహాటంగానే వినిపిస్తున్నాయి.