షాకింగ్ : ఓటిటిలో మళ్ళీ అయ్యగారి సినిమాకి దెబ్బ 

టాలీవుడ్ అయ్యగారిగా పిలుచుకునే యంగ్ హీరో అక్కినేని డైనమైట్ అయినటువంటి అఖిల్ అక్కినేని హీరోగా ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన రీసెంట్ సినిమానే “ఏజెంట్”. తన కెరీర్ లోనే ఏ సినిమాకి కూడా పడని కష్టాన్ని ఈ సినిమాకి పడ్డాడు కానీ మేకర్స్ మాత్రం తన కష్టాన్ని వృథా చేసి పారేసారు.

దీనితో చాలా డిజప్పాయింట్ అయ్యిన అఖిల్ ఈ సినిమా నుంచి తేరుకోడానికి కాస్త టైం తీసుకున్నాడు. మరి థియేటర్స్ లో మొదటి రోజే తేలిపోయిన ఈ చిత్రం రెండో రోజుకి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిపోయింది. దీనితో జస్ట్ ఒక్క నెల లోపే ఓటిటి డేట్ ని ఇది ఫిక్స్ చేసుకుంది.

కాగా ఈ భారీ సినిమా ఈ నెల లోనే ఓటిటి యాప్ సోని లివ్ లో స్ట్రీమ్ కావలసింది కానీ కొన్ని కారణాలు చేత వాయిదా పడింది. దీనితో అక్కడ నుంచి సుమారు ఆరు నెలలు వాయిదా పడగా ఫైనల్ గా మొన్ననే సోని లివ్ వారు ఈ చిత్రాన్ని ఈరోజు సెప్టెంబర్ 29 నుంచి అందుబాటులోకి తెస్తామని గుడ్ న్యూస్ అందించారు.

కానీ షాకింగ్ గా ఈ సినిమా ఈరోజు కూడా రాలేదు. దీనితో మళ్ళీ ఏజెంట్ ని ఆపేశారని తెలుస్తుంది. కాగా దీనికి కారణం మళ్ళీ మేకర్స్ కి ఓటిటి సంస్థ కి ఉన్న ఏదో లొసుగు మూలానే అని కొందరు అంటున్నారు. మరి ఈ సినిమా విషయంలో మాత్రం అయ్యగారికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దర్శకుడు సురేందర్ రెడ్డి వర్క్ చేయగా అనీల్ సుంకర నిర్మాణం వహించారు.