థియేటర్స్ లో మళ్ళీ “RRR” కి భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయమా.?

RRR

RRR : దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన బిగ్ మల్టీ స్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఆల్రెడీ థియేటర్స్ లో అయ్యి దాదాపు 1200 కోట్లు గ్రాస్ వసూలు చెయ్యడమే కాకుండా అంతా అయ్యాక ఇప్పుడు ఓటిటి లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యిపోయింది.

మరి ఇంతలా వచ్చేసిన సినిమాకి మళ్ళీ భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఏంటా అనుకుంటున్నారా? అవును ఇది ముమ్మాటికీ నిజమే మళ్ళీ ఎలా లేదన్నా భారీ నంబర్స్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి రికార్డు అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఇంకా డీటెయిల్స్ లోకి వెళితే ఈ సినిమాకి భారీ వసూళ్లు రావడంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా కీలక పాత్ర వహించింది.

మరి యూఎస్ లో ఈ సినిమాని ఈ జూన్ 1న స్పెషల్ షో వేస్తున్నట్టుగా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. మొదట కేవలం ఒక్కో షో అందులోని 100 ఏరియాల్లో ప్లాన్ చెయ్యగా ఇప్పుడు ఈ సినిమా అన్ కట్ వెర్షన్ ని మళ్ళీ చూడడానికి ఓవర్సీస్ ఆడియెన్స్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారట.

దీనితో ఈ సినిమాకి భారీ డిమాండ్ అనేక చోట్ల మళ్ళీ నెలకొనడంతో మరింత స్థాయిలో ఆ స్పెషల్ షో కి క్రేజ్ పెరిగినట్టుగా తెలుస్తుంది. దీనితో ఓవర్సీస్ డాలర్స్ ప్రకారం చూసినట్టు అయితే మళ్ళీ డెఫినెట్ గా ఆ ఒక్క రోజుల్లో సాలిడ్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి ఆ నంబర్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.