గాసిప్స్ : అప్పుడే ఆమెతో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్.?

ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఎందరో హీరోస్ లో అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. మరి మరి వరుణ్ హీరోగా ఇప్పుడు గాండీవ దారి అర్జున సహా మరో సినిమాలు చేస్తుండగా ఈ సినిమాల షూటింగ్ లో తాను బిజీగా ఉన్నాడు. కాగా వరుణ్ తేజ్ విషయంలో అయ్యితే గత కొన్నాళ్ల నుంచి పలు ఇంట్రెస్టింగ్ గాసిప్స్ కూడా వచ్చాయి.

యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ  త్రిపాఠి తో డేటింగ్ లో ఉన్నట్టుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి. దాదాపు వీరి మేటర్ పెళ్లి వరకు కూడా టాక్ వచ్చింది. కానీ మధ్యలో అయితే అలాంటివి ఏమీ లేవని వారు తెలిపారు. కానీ ఇప్పుడు మళ్ళీ క్రేజీ గాసిప్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఆల్ మోస్ట్ పెళ్లి దగ్గరకి వచ్చేసినట్టుగా బాలీవుడ్ మీడియా చెప్తుంది. కాగా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ కి అయితే అంతా సెట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ జూన్ లోనే వీరి ఇద్దరు కుటుంబాల సమక్షంలో అయితే నిశ్చితార్థం జరుగుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మరి అసలు ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి ఓ వెబ్ సిరీస్ లో కనిపించగా తన లాస్ట్ సినిమా “హ్యాపీ బర్త్ డే” డిజాస్టర్ అయ్యింది. మరి ఈ  జంటపై వార్తలు ఎంతవరకు నిజం కానున్నాయో చూడాలి.