మరోసారి ఎన్టీఆర్ కి అవమానం..తీవ్ర ఆవేదనలో ఫ్యాన్స్!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అయితే ఉన్న పలు టాప్ మోస్ట్ కుటుంబాల్లో నందమూరి కుటుంబం కోసం ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. అయితే వీరి కుటుంబ హీరోలు ఇప్పుడు సినిమాల పరంగా భారీ సక్సెస్ లు అందుకున్నా వారి కుటుంబంలో మాత్రం అంతర్గత కలహాలు మాత్రం అలానే ఉన్నాయని మరోసారి నిరూపితం అయ్యింది.

కాగా కొన్ని రోజులు కితమే నందమూరి వారై ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రత్న కన్ను మూయడంతో వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ తదుపరి కార్యక్రమాల్లో ఉన్న వీరి కుటుంబం ఆ పనుల్లో ఉన్నారు. అయితే తాజాగా ఓ షాకింగ్ విజువల్ ఎన్టీఆర్ అభిమానులని ఎంతగానో కలచి వేస్తుంది.

అయ్యితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో లో ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఆ సమయంలో బాలకృష్ణ అక్కడికి రాగానే ఎంతో మర్యాదతో ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు బాలయ్య పై గౌరవంతో నిలుచుకున్నారు కానీ బాలయ్య మాత్రం వారిని చిన్న చూపు కూడా చూడనట్టుగా మిగతా వారిని పలకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

దీనితో ఈ విజువల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా తీవ్రంగా కలిచేస్తుంది. తమ కుటుంబంలో ఇప్పటికే ఎన్టీఆర్ కి ఎన్నో అవమానాలు.. ఇప్పటికీ నందమూరి కుటుంబానికి తెలుగు సినిమా దగ్గర ఒక ఫేమ్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ వల్లే అని అందరికీ తెలుసు. అలాంటిది ఎన్టీఆర్ కే ఎలాంటి విలువ ఇవ్వకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా బాధగా అనిపిస్తుంది. దీనితో ఇతర హీరోల అభిమానులు తారక్ ఫ్యాన్స్ కి ధైర్యం చెప్తున్నారు.