రవితేజ క్రాక్ ట్రైలర్ చూశాక ఇండస్ట్రీలో మొదలైన టాక్ ఇదే ..?

రవితేజ క్రాక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ నుంచి గత కొంతకాలంగా వస్తున్న సినిమాలన్ని భారీ డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. అయినా రవితేజ మాత్రం జోరుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా కి సై అన్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో బలుపు, డాన్ శీను లాంటి మాస్ ఎంటెర్టైనర్స్ వచ్చి బ్లాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టాయి. దాంతో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా రవితేజ – గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న క్రాక్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Krack: Ravi Teja unveils new poster with Shruti Haasan. See pic - Movies  News

అంతేకాదు గత నెల నుంచి క్రాక్ సినిమా విషయంలో టీం విపరీతంగా ప్రమోషన్ చేస్తూ ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా న్యూ ఇయర్ ని పురస్కరించుకొని క్రాక్ సినిమా నుంచి మాంచి యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ఊహించని విధంగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీ వర్గాలలో ఈ సినిమా మీద భారీగా సూపర్ హిట్ అన్న అంచనాలు మొదలయ్యాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలకి రానటువంటి రెస్పాన్స్ క్రాక్ సినిమాకి వస్తోంది.

ఇక లాక్ డౌన్ కారణంగా బాక్సాఫీస్ వద్ద సందడి కరువైన సంగతి తెలిసిందే. దాంతో సంక్రాంతి బరిలో దిగబోతున్న రవితేజ క్రాక్ సినిమా మీదే అందరి చూపు ఉంది. మొత్తానికి తాజా ట్రైలర్ తో రవితేజ క్రాక్ సినిమా హిట్ అన్న టాక్ వచ్చేసింది. ఇదే టాక్ సినిమా రిలీజయ్యాక వస్తే గనక ఇక ఈ మాస్ మహారాజా ని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమా తర్వాత రవితేజ ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.