చరణ్ సినిమాకి ఏడ్చారు..కమల్ సినిమాకి కూడా ఏడుస్తారా?

ramcharan-director-shankar-wrap-up-the-first-schedule-of-rc15001

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర రానున్న పలు భారీ చిత్రాల్లో అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ చేంజర్” ఒకటి కాగా అలాగే దీనితో పాటుగా కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఉలగనయగన్ కమల్ హాసన్ నటిస్తున్న భారీ సీక్వెల్ “ఇండియన్ 2” కూడా ఒకటి.

అయితే ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాల షూటింగ్ ఇపుడు ఒకదాని తర్వాత ఒకటి ప్లానింగ్ ప్రకారం శంకర్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ సినిమాపై కొన్ని వార్తలు రావడంతో కొందరు నెటిజన్స్ ఆ సినిమాని రామ్ చరణ్ ని ట్రోల్ చేశారు.

గేమ్ చేంజర్ లో పలు సన్నివేశాలు యంగ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించడంతో కావాలని సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ కాబట్టే శంకర్ ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ గా లేరని అందుకే వేరే దర్శకుడితో సినిమా చేయించుకుంటున్నారు అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

అయితే ఇపుడు కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 2 కి కూడా తమిళ్ నుంచి ఓ యువ దర్శకుడు పలు సన్నివేశాలను తెరకెక్కించడం జరిగిందట. ఇదైతే ఏకంగా కమల్ హాసన్ పైనే సీన్స్ ని దర్శకుడు అరివ జగన్ అనే యంగ్ దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుంది. ఇక్కడ చరణ్ సినిమాకి అయితే రామ్ చరణ్ లేని సీన్స్ ని కమెడియన్స్ పై దర్శకుడు శైలేష్ తెరకెక్కించాడు.

సో ఇక్కడ అనవసరంగా ట్రోల్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు బఫున్స్ అయ్యారని చెప్పాలి. ఇపుడు ఇండియన్ సినిమా అంతా ఒకటే అవుతుంది కానీ మన దగ్గర మన వాళ్లే ఒకరినొకరు తగ్గించుకుంటూ ఇతర ఇండస్ట్రీ వాళ్ళ ద్రుష్టిలో చీప్ చేసుకుంటున్నారు.