మన దక్షిణాది సినిమా వద్ద భారీ క్రేజ్ అనే పదం వస్తే గుర్తుకువచ్చే పేర్లు చాలా తక్కువే ఉంటే వాటిలో మొదటగా సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్లే ఓ దశాబ్ద కాలం కితం అయితే వినిపించేవి. వీరివే ఎందుకు అంటే అప్పట్లో చిరు సినిమాలకి దూరంగా ఉన్న సమయంలో మొత్తం సౌత్ సినిమా దగ్గర భారీ ఓపెనింగ్స్ రికార్డ్స్ ఒక్క రజిని నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు మీదే ఉండేది.
అది వారి సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా కూడా ఓపెనింగ్స్ మాత్రం రికార్డు సెట్ చేసి పెట్టేవారు. ఇక నెక్స్ట్ అలా నెమ్మదిగా వారి సినిమాలు మూలాన మార్కెట్ తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ వారి క్రేజ్ అనేది చెక్కు చెదరలేదు. అయితే రీసెంట్ గా తమిళ సినిమా వ్యవహారం ఒకింత ఆసక్తిగా మారుతూ వస్తుంది.
కాగా తమిళ్ ఇండస్ట్రీ వారు తమిళ్ లోనే తమిళ వారితోనే సినిమాలు చేయాలనీ ఓ రూల్ తెచ్చుకోగా దీనిపై అయితే మన నుంచి పవన్ కళ్యాణ్ మొదటిసారిగా గళమెత్తి ప్రశ్నించారు. అయితే ఇక నెక్స్ట్ లేటెస్ట్ గా రజినీకాంత్ కూడా తమ సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడ్డం వైరల్ గా మారింది.
నిన్న తన సినిమా జైలర్ ఆడియో వేడుకలో మాట్లాడుతూ ఓ పదేళ్ల కితం కన్నడ సినిమా ఇండస్ట్రీ కోసం ఎవరికీ తెలియదు కానీ ఇపుడు కాంతారా, కేజీఎఫ్ లాంటి సినిమాలు మూలాన అందరికీ తెలిసింది. అలాగే తెలుగు సినిమా కూడా బాహుబలి, పుష్ప, RRR లాంటి చిత్రాలతో ఎంతో పేరు తెచ్చుకుంది.
అదే విధంగా మన తమిళ ఇండస్ట్రీ కూడా మరింత స్థాయికి ఎదగాలి అని పెద్ద హీరోల సినిమాలు అందరికీ అన్నం పెడతాయి అలాగే మన సినిమాలు ఆడాలి ఇతరుల సినిమాలు కూడా ఆడనివ్వాలి అనే కామెంట్స్ రజినీ చేసారు. దీనితో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.