లేటెస్ట్ : 200 కోట్ల తర్వాత రవితేజ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.!

ఇప్పుడు దాదాపు మన టాలీవుడ్ దగ్గర ఉన్న అందరు స్టార్ హీరోలు కూడా మంచి కం బ్యాక్ అందుకొని భారీ వసూళ్లతో తమ సినిమాలు హిట్స్ కొడుతున్నారు. ఇక ఆ హీరోస్ లో అయితే మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ నటించిన లేటెస్ట్ అండ్ లాస్ట్ చిత్రాలు రెండు కూడా రికార్డు వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసాయి.

మరి ఈ చిత్రాల్లో ధమాకా 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా నెక్స్ట్ వచ్చిన మెగా మాస్ వాల్తేరు వీరయ్య ఏకంగా 200 కోట్ల భారీ మార్క్ ని టచ్ చేసింది. మరి ఇందులో తన షేర్ 100 కోట్లు వేసుకున్నా బ్యాక్ టు బ్యాక్ మాత్రం రవితేజ 200 కోట్ల మార్క్ లోకి వచ్చేసాడు. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ రవితేజ చేయనున్న ఇతర సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఆ చిత్రాల్లో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “రావణాసుర” కూడా ఒకటి. ఇక దీని నుంచి చిత్ర యూనిట్ లేటెస్ట్ గా ఓ గుడ్ న్యూస్ ఫ్యాన్స్ కి అందించారు. మరి ఈ చిత్రం నుంచి అయితే ఈ జనవరి 26న రవితేజ బర్త్ డే కానుకగా సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు.

ఈ సినిమా ఆల్రెడీ ఓ సాలిడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతూ ఉండగా ఇంకా టైం అనౌన్స్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా నటిస్తుండగా మేఘా ఆకాష్, అను ఇమ్మానుయేల్ అలాగే పూజిత పొన్నాడ,  దక్ష నగర్కార్ అలాగే జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.