అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన ఆది పురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అభిమానులకు మరొక హీరో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఇలాంటి పోటీలు ఏర్పడడం సర్వసాధారణం అయితే తాజాగా ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల అభిమానుల మధ్య ఇలాంటి పోటీ ఏర్పడింది.పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే రాముడుగా ప్రభాస్ బాణం ఆకాశానికి ఎక్కు పెడుతూ ఉన్నటువంటి పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది అయితే ఈ పోస్టర్ చూసిన అభిమానులలో కాస్త అసంతృప్తి నెలకొందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పోస్టర్ తో ప్రభాస్ పోస్టర్ ను పోలుస్తూ పెద్ద ఎత్తున అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే మా హీరో రాముడి లుక్ లోఅద్భుతంగా ఉన్నారంటే మా హీరో అద్భుతంగా ఉన్నారంటూ ట్విట్టర్ వేదికగా అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ట్విట్టర్ వార్ జరుగుతుంది. ఏది ఏమైనా రాముడు లుక్ ప్రభాస్ కన్నా రామ్ చరణ్ కు అద్భుతంగా ఉందంటూ రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రభాస్ లోకి విషయంలో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.అయితే అభిమానుల మధ్య హీరోల గురించి ఈ విధమైనటువంటి పోలికలు వ్యత్యాసాలు రావడం సర్వ సాధారణం.