తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న కే. రాఘవేంద్రరావు, అగ్ర హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ ల కాంబినేషన్లో దాదాపుగా ఏడు సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకోలేకపోయింది.
కే. రాఘవేంద్రరావు గారు మొదటి జనరేషన్ హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలందరికీ సూపర్ హిట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క ఏఎన్ఆర్ కు మాత్రం ఒక్క సినిమా కూడా విజయం అందించలేకపోయారు. ఇక రెండవ జనరేషన్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలకు మంచి సూపర్ హిట్ విజయాలను అందించారు.
ఇక అసలు విషయానికి వస్తే కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా వివరాలు ఏమిటో చూద్దాం.
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు: ఈ చిత్రం 1980లో విడుదల కావడం జరిగింది. ఈ చిత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారే నిర్మించారు. ఈ చిత్రం సానుకూల ఫలితాలను ఇచ్చింది.
పట్టాభిషేకం: ఈ చిత్రం1985లో విడుదల కావడం జరిగింది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ నిర్మించడం జరిగింది. మొదటివారం కమర్షియల్ గా ఊపొందుకొని రెండవ వారం నుండి బాక్సాఫీస్ వద్ద సానుకూల ఫలితాలతోనే సరిపెట్టుకోవడం జరిగింది.
అపూర్వ సహోదరులు: ఈ చిత్రం 1986లో విడుదల అయింది. మొదటి వారంలో 80 లక్షల వరకు వసూలు చేసి రెండవ వారం నుండి సానుకూల ఫలితాలను ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద జస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.
సాహస సామ్రాట్: ఈ చిత్రం 1987వ సంవత్సరంలో విడుదల కాగా, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయం కావడం జరిగింది.
దొంగ రాముడు: 1988లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారం కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడం జరిగింది.
అశ్వమేథం: 1992లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం అయింది.
పాండురంగడు: 2008 విడుదలైన ఈ చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద సానుకూల ఫలితాలతో సరిపెట్టుకోవడం జరిగింది.