జయం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలివుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సదా ఆ సినిమా మంచి హిట్ అవటంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు నటించిన సినిమాలలో ఎక్కువగా సంప్రదాయమైన దుస్తులు ధరించింది. కానీ ప్రియసఖి సినిమాలో మాత్రం పొట్టి పొట్టి బట్టలు ధరించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే అమ్మడు తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కొంతకాలం ఢీ షో కి జడ్జ్ గా వ్యవహరించిన సదా ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హోం టూర్, వీడియోలు, మేకప్ వీడియోస్, ఫిట్నెస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇటీవల హలో వరల్డ్ అనే వెబ్‌సిరీస్ లో నటించిన సదా.. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనింది.ఈ క్రమంలో సదా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూ లో సదా మాట్లాడుతు.. పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్థుత కాలంలో 10 జంటలు పెళ్ళి చేసుకుంటే అందులో 5 జంటలు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా వెల్లడించింది. ప్రస్తుతం నా లైఫ్ నేను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను.పార్టీలకు పబ్బులకు వెళ్లి మందు తాగే అలవాటు లేదు. భవిష్యత్తులో కూడా నా జీవితం నాకు నచ్చినట్లే బతకాలనుకుంటున్నాను. పెళ్లి పేరుతో ఎవరో వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించాలని కోరుకోను. కానీ నాకు కాబోయే భర్త మాత్రం నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు సదా చెప్పుకొచ్చింది. అయితే ఇంత వయసు వచ్చినా కూడా సదా పెళ్లికి దూరంగా ఉండటానికి కారణం గురించి మాత్రం బయట పెట్టలేదు.