తన భర్తను వదిలేయడానికి కారణం అదే అంటున్న నటి ప్రగతి!

Actress Pragathi post goes viral

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరును సంపాదించుకున్న ప్రగతికి సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ఒకానొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమాలలోనే మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు వారు సోషల్ మీడియా ద్వారా బాగా మంచి పాపులారిటీని సంపాదించి బుల్లితెరపై జరిగే చిన్న చిన్న షోలలో జడ్జిలుగా కూడా చేస్తున్నారు.

సీనియర్  క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరైన ప్రగతి గురించి తెలుగు ఇండస్ట్రీలో అందరికీ ఆమె తెలుసు. ఎక్కువగా సినిమాలలో పాజిటివ్ పాత్రలలో కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రగతి ఎక్కువగా హీరోయిన్ తల్లి పాత్రలలో నటిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈమెకు భారీ క్రేజ్ ఉన్న కారణంగా ఈమె ఎలాంటి ఫోటోలను షేర్ చేసిన అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.

చాలా సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ప్రగతి ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు దాటిన వారిలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జిమ్ లో చాలా కసరత్తులు చేసి ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాక మంచి కామెడీ టైం ఉన్న పాత్రల్లో కూడా ప్రగతి కనిపించింది. రీసెంట్ గా F2, F3 సినిమాలలో హీరోయిన్ తమన్నా తల్లిగా మంచి కామెడీ టైమింగ్ తో కామెడీని పండించింది ప్రగతి.

ఇక ఆమె బుల్లితెరలో కూడా పలుషోలలో స్టెప్పులు వేస్తూ కనిపించిన విషయం అందరికి తెలిసిందే. ఇక తాజాగా ఆమె ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ప్రగతి అందులో చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమెకు సినిమాల్లో అవకాశం ఆమె ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు వచ్చిందని ఆమె తెలిపింది. అలాగే ఆమె పొలిటికల్ సైన్స్ చదివింది అని చెప్పింది. దీంతో ఆర్ కే.. అయితే పొలిటికల్ లీడర్ అయిపోవచ్చు కదా అని అనగా.. నా బొంద అది కాదు అని నవ్వుతూ చెప్పింది.

ఇక ఆ తర్వాత ఆమె సినిమాల్లో అందరితో గంభీరంగా మాట్లాడుతూ ఉంటానని అని చెప్పడం జరిగింది. అలాగే  సినిమా ఇండస్ట్రీలో అందమే ఒకవేళ ఫ్యాక్టర్ అయితే.. నేను అందగత్తెని.. నాకు సినిమా అవకాశాలు వస్తాయ్.. అని కూడా చెప్పుకొచ్చింది. ఆంటీ అని నిన్ను కూడా పిలిస్తే నీకు కోపం అంట కదా అని అంటే అస్సలు అనకూడదు అని ఆమె చెప్పింది. ప్రగతి ఆమె తన భర్తతో డివోర్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఆమెకు ఒక కొడుకు ఇంకా కూతురు కూడా ఉంది. మరి కొడుకు జాబ్ చేస్తున్నట్టు మరి కూతురు యూఎస్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్టు తెలిపింది.

అలాగే తను ఎప్పుడు సోషల్ మీడియాలో చేసే వీడియోలకి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చిన తను పట్టించుకోనని ఆమె వెల్లడించింది. ఇదే విధంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలు చేస్తున్నట్టు ఇంకా కొన్ని సీరియల్ లలో కూడా నటిస్తున్నట్టు ఆమె తెలిపింది.