చిన్నప్పుడు స్కూల్‌లో చివరి గంట మోగడంతోనే ఇంటికి వెళ్తున్నామనే ఆనందంలో గంతులు వేసిన క్షణాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అలా పెద్దయ్యాక ఆఫీస్ టైం అయిపోయిందని ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందటే ఆనందంగా ఉంటారు కొందరు. అదే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసి ఇంటికి వెళ్లే సమయంలో ఆసన్నమైందంటే నటీనటులకు ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రగతి అలా గాల్లో తేలిపోతోంది.
షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్తున్నామని ప్రగతి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను ఎలా ఉంటానో పరోక్షంగాచెబుతున్నట్టుగా వీడియోను షేర్ చేసింది. ఇక అందులో ప్రగతి తీన్మార్ స్టెప్పులు వేస్తుంది. కారులో పాట పెట్టుకుని ఇంటికి వెళ్తున్నామనే ఆనందంలో ఊర మాస్ మూమెంట్లు వేసింది. మొత్తానికి ప్రగతి సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో వాడుకుంటోంది.
ప్రగతి చేసే రచ్చకు ఇప్పుడు ఆమె ఇమేజ్ మొత్తంగా మారిపోయింది. ఆమె చేసే డ్యాన్స్‌లు, వర్కవుట్లు ఫుల్లు వైరల్ అయ్యాయి. అలా లాక్డౌన్‌లో ప్రగతి చేసిన హల్చల్‌కు ఆమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆమెకు వచ్చే పాత్రల్లోనూ ఎంతో తేడా ఉంటోందట. అంతే కాకుండా ఈమె చేసే వెరైటీ ఫోటో షూట్లు, అందాల ఆరబోతకు దర్శక నిర్మాతలు ఫిదా అవుతున్నారట.