కోలీవుడ్ క్యూట్ కపుల్ ఆది పినిశెట్టి,నిక్కీ గల్రానీల గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఈ ఏడాది మే నెలలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే రరెండు రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఆది పినిశెట్టి,నిక్కీ గల్రానీలు జీవితంలోకి మరొక అతిథి రాబోతున్నారు అంటే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ వార్త విన్న పలువురు అభిమానులు నిజమని అనుకుంటున్నారు. అయితే ఈ వార్తలు మరింత జోరుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో ఆ వార్తలపై హీరోయిన్ నిక్కీ గల్రానీ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడింది. తన ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన ఆమె ఇంకెందుకు డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు ప్రచారాలు చేస్తున్నారు. ఒక పని చేయండి. డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది.
— Nikki Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022
అంతేకాకుండా ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కాదని ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆ వార్తలను కొట్టి పడేసింది నిక్కీ గల్రానీ. ఒకవేళ అటువంటి విషయం ఏదైనా ఉంటే తప్పకుండా స్వయంగా తానే ప్రకటిస్తాను అని ఆమె వెల్లడించింది. భవిష్యత్తులో తప్పకుండా అది జరుగుతుందని అప్పటివరకు ఇటువంటి పుకార్లను నమ్మొద్దు అంటూ తన ప్రెగ్నెన్సీ వార్తలకు పుల్ స్టాప్ పెట్టేసింది. కాగా ఆది పిన్ని శెట్టి విషయానికి వస్తే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ విప్పిస్తున్నాడు ఆది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.