గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ.. బేబీ బంప్‌తో స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ క్రేజీ యాంక‌ర్స్‌లో హ‌రితేజ ఒక‌రు. సినిమాలు, సీరియ‌ల్స్ చేసుకుంటూ కాలం గ‌డిపిన ఈ బ్యూటీకి అనుకోకుండా సీజ‌న్ 1లోనే బిగ్ బాస్ ఆఫ‌ర్ త‌లుపు త‌ట్టింది. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా హౌజ్‌లోకి వెళ్ళింది. అక్క‌డ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి హ‌రితేజ చేసిన సంద‌డి అంతా ఇంతాకాదు. ఒక రోజు ఇంటి స‌భ్యుల ముందు హ‌రిక‌థ‌ని చెప్పి త‌న పూర్తి టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టింది. హ‌రితేజ టాలెంట్‌కు హౌజ్‌మేట్సే కాదు ప్రేక్ష‌కులు కూడా ఫుల్ ఫిదా అయ్యారు. బిగ్ బాస్ త‌ర్వాత ప‌లు క్రేజీ ఆఫ‌ర్స్ అందుకున్న హ‌రి తాజాగా శుభవార్త అందించింది.

తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియో షేర్ చేస్తూ తాను త్వ‌ర‌లో పండంటి బేబికీ జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు తెలియ‌జేసింది. వీడియోలో త‌న బేబి బంప్‌ని చూస్తూ చాలా మురిసిపోతూ కాళ్లు క‌దిలించింది. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భంకి సంబందించిన‌ ఫొటోల‌తో పాటు వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. లాక్‌డౌన్‌కి ముందు ఏదో అడ‌పాద‌డపా ఆఫ‌ర్స్ అందుకున్న హ‌రితేజ‌కు ఇప్పుడు ఆఫ‌ర్సే క‌రువ‌య్యాయి.

త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అఆ సినిమాలో స‌మంత‌కు అసిస్టెంట్‌గా ప‌ని చేసిన హ‌రితేజ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. అప్ప‌టి వ‌ర‌కు చాలా చిత్రాల‌లో న‌టించిన కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. బిగ్ బాస్ త‌ర్వాత ఈ అమ్మ‌డిని ప్ర‌తి ఒక్క‌రు గుర్తు ప‌ట్ట‌డం కామ‌న్ గా మారింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరియ‌ర్‌ని స‌జావుగా సాగిస్తున్న హ‌రితేజ మ‌రికొద్ది రోజుల‌లో పండంటి బేబికు జ‌న్మ‌నివ్వ‌డంతో పాటు అందులోని మాతృత్వాన్ని త‌నివితీరా ఆస్వాదించ‌నుంది. హ‌రితేజ ప్ర‌స్తుతం ప్ర‌గ్నెంట్ అని తెలియ‌గానే అభిమానులు, సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.