Kiara Advani: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రాంచరణ్ బ్యూటీ… సంతోషంలో అభిమానులు!

Kiara Advani: భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి కియారా అద్వాని ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా తర్వాత కియార అద్వాని సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం గత రెండు సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇలా పెళ్లి తర్వాత కూడా కియారా తన సినిమా పనులలో ఎంతో బిజీగా మారిపోయారో ఇటీవల రామచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచిందని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా కీయారా అద్వానీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు శుభవార్తను తెలియజేశారు.

ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేస్తూ ఆ ఫోటోలో భాగంగా తన భర్త సిద్ధార్థ మల్హోత్రా చేతులలో కియారాచేతులు పెట్టి అనంతరం తన చేతులలో పిల్లల సాక్సులను పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలోనే రానుంది అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు ఇలా త్వరలోనే ఈమె తల్లి కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం కియారకు అభినందనలు తెలియజేస్తున్నారు.