దీపికా పదుకొణె, అనన్యా పాండే, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’గెహ్రీయాన్’ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీపికాపదుకొణెతో ఇంటిమేట్ సీన్స్‌లో యాక్ట్ చేయడంపై నటుడు సిద్దాంత్ తాజాగా స్పందించారు. ఆ సమయంలో తాను భయాందోళనకు గురైనట్లు చెప్పారు.
ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఒత్తిడికి గురయ్యా. కంగారుపడ్డా. నిర్మాత కరణ్ జోహార్, మా నాన్న నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆరోజు మా నాన్న చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. గొప్ప దర్శకుడు, పేరుపొందిన నిర్మాణసంస్థ, స్టార్ క్యాస్ట్.. భారతదేశంలో ఉన్న చాలామంది యువ నటులు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి విషయాలను వాళ్లు ఎక్కువగా ఆలోచించరు. నువ్వు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇది నీ వృత్తిలో భాగమే. ఎక్కువగా ఆలోచించి చింతించకు అన్నారు. కరణ్ సైతం ఇదేవిధంగా ధైర్యం చెప్పారు.
వాళ్ల మాటలతో ఆయా సన్నివేశాల్లో యాక్ట్ చేశా. సినిమా విడుదలయ్యాక తల్లిదండ్రులతో కలిసి థియేటర్‌కు వెళ్లా. ఇంట్లో వాళ్లకు దూరంగా ఓమూల నిల్చొని సినిమా చూశా‘ అని చెప్పారు. రణ్‌వీర్‌సింగ్‌తో వివాహమైన అనంతరం ఆమె నటించిన పూర్తిస్థాయి రొమాంటిక్ కథా చిత్రం ’గెహ్రీయాన్’. షకున్ బత్రా దర్శకత్వం వహించారు. పెళ్లయిన తర్వాత ఇలాంటి చిత్రంలో నటించడంపై దీపిక విమర్శలు ఎదుర్కొన్నారు.