Deepika Padukone: రూ.25 కోట్లు డిమాండ్ చేసిన దీపికా పదుకొణె.. దర్శకుడి రియాక్షన్ ఇదే!

Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది దీపికా. అలాగే పలు కమర్షియల్ ఈ యాడ్స్ లో కూడా నటించి బాగానే సంపాదించింది. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాకుండా బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది దీపికా పదుకొణె. ఇది ఇలా ఉంటే దీపికా పదుకొనే తన డిమాండ్ల కారణంగా ఒక భారీ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

వర్కింగ్‌ అవర్స్‌, భారీ పారితోషికం డిమాండ్‌ చేశారని, అందువల్లే ఆమెను చిత్రబృందం తొలగించింది అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఈ విషయాలపై ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను 500 మంది సిబ్బందితో కలిసి పని చేస్తున్నాను. సినీ రంగంలోని వారికి కూడా సొంత జీవితాలు కూడా ఉంటాయి. వారి ఆరోగ్యం కూడా ముఖ్యం.

వర్కింగ్‌ అవర్స్‌ విషయంలో దీపికా డిమాండ్‌ న్యాయమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ లు కూడా 8 గంటల షిఫ్ట్‌ లోనే పని చేస్తారు. దీపికా విషయంలో ఇది ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు. దీన్ని నిరాకరించడానికి దర్శకులకు సరైన కారణం ఉండాలి. సినిమా రంగంలో ఉన్నవారు షూటింగ్‌ ల కోసం వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే విషయాన్ని నేను అంగీకరించను. నేనెప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్‌ చేయలేదు. అలాగే ఆదివారాల్లోనూ చిత్రీకరణ చేయను అని తెలిపారు కబీర్ ఖాన్. ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు ఎవరైనా తగిన పారితోషికానికి అర్హులే. వ్యక్తులను చూసి కాకుండా వారికి ఉన్న స్టార్‌డమ్‌ చూసి రెమ్యూనరేషన్‌ ఇవ్వాలనీ అన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ గా మారింది. దీపికా ప్రాజెక్ట్‌ పై వస్తోన్న వార్తల గురించి ఆమె స్పందించకపోయినప్పటికీ బాలీవుడ్‌ తారలు ప్రత్యక్షంగా పరోక్షంగా వేదికపై, ఇంటర్వ్యూల్లోనూ దీని గురించి మాట్లాడుతున్నారు.