Deepika-Ranveer: దీపిక, రణ్‌వీర్ లలో ఎవరు బాగా రిచ్.. ఇద్దరి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Deepika-Ranveer: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2011 నుంచి ఈ దంపతులు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి పని సినిమాలలో నటించారు. ఒక సినిమా సెట్స్ లో మొదలైన వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా దాదాపుగా ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటలీలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ దంపతులకు ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తల్లిగా తన కూతురి బాధ్యతలు చూసుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది దీపికా పదుకొనే.

ఇది ఇలా ఉంటే తాజాగా జూలై ఆరవ తేదీన రణ్‌వీర్ సింగ్ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభిమానులు రణ్‌వీర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే బర్త్డే సందర్భంగా రణ్‌వీర్ కు సంబందించిన ఒక వార్త వైరల్ గా మారింది. కాగా రణవీర్ సింగ్ మొత్తం ఆస్తులు రూ.362 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. 2019లో అతని వార్షిక ఆదాయం రూ.21 కోట్లు. ఇప్పుడు అది పెరిగింది. రణవీర్ సింగ్ అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే దీపికా పదుకొనేకు సినిమా పరిశ్రమలో రణ్‌వీర్ సింగ్ కంటే ఎక్కువ క్రేజ్, పాపులారిటీ, డిమాండ్ ఉంది. అంతేకాదు రణ్‌వీర్ కంటే దీపిక ఖాతాలోనే సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. సక్సెస్ రేటు కూడా ఎక్కువే. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దీపిక ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల కు పైగా రెమ్యునరేషన్ అందుకుంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. ప్రస్తుతం దీపికా పదుకొనే మొత్తం ఆస్తులు 500 కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఈ ఇద్దరి దంపతుల ఆస్తులు కలిపితే మొత్తం 860+ కోట్లు అవుతుంది. వీటితోపాటు ఈ దంపతుల వద్ద కోట్లు విలువ చేసే పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట.