‎Deepika Padukone: ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకోవడం వెనుక ఉన్న కారణం అదేనా?

‎Deepika Padukone: సందీప్ రెడ్డి రంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా స్పిరిట్. ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపనున్నారు.

‎ కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉంది. కానీ ఆమె ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిందట. అయితే దీనికి గల కారణాలు ఇవే అంటూ ఇప్పటికే చాలా పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది. స్పిరిట్ సినిమా కథ దీపికా పదుకొనేకి నచ్చిందన్నది నిజమే. ఇక ఒప్పందంపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఇంతలోనే అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా నుంచి కూడా దీపికా కు ఆఫర్ వచ్చింది. అందులోని కథ, ఆమె పాత్ర దీపికకు బాగా నచ్చాయట.

‎అయితే ఒకేసారి రెండు సినిమాలు చేయడం కష్టమని భావించిందట. పైగా రెండు మూవీస్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. కాబట్టి రెండింటిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చిందట. ఈ క్రమంలోనే దీపికా పదుకొనే స్పిరిట్ సినిమాను పక్కన పెట్టి అల్లు అర్జున్ తో సినిమా ఎంచుకుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. దీపిక ప్రభాస్ తో కల్కి 2898 అది సినిమా చేసింది. కానీ అల్లు అర్జున్ తో ఆమెకు ఇదే మొదటి అవకాశం. అందుకోసమే దీపికా స్పిరిట్ సినిమా నుంచి తప్పకుండా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..